నందిగం సురేష్‌కు సుప్రీంలో ఎదురుదెబ్బ..! 1 d ago
AP: హత్య కేసులో మాజీ ఎంపీ నందిగం సురేష్ కు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీం నిరాకరించింది. 2020లో ఎస్సీ మహిళ మరియమ్మపై సురేష్ అనుచరులు దాడి చేసి ఆమెను హత్య చేశారు. ఇదే కేసులో నందిగం సురేష్ బెయిల్ ను ఏపీ హైకోర్టు తిరస్కరించింది. హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాలు చేశారు. ఈ కేసులో చార్జిషీటు దాఖలైనందున బెయిల్ కోసం ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని నందిగం సురేష్ బెయిల్ పిటీషన్ ను సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది.